మీసం మెలిపెడితే కల్ట్​..

మీసం మెలిపెడితే కల్ట్​..

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ ‘స్కంద’. జీ స్టూడియోస్‌‌తో కలిసి శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీలోని స్పెషల్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘కల్ట్ మామా, కల్ట్ మామా, కల్టే.. నువ్వు కాలు దువ్వితే అంతే మామా.. కత్తులకైనా గిల్టే.. నీకు ఎదురుపడితే ఒణికిపోద్ది నడుముకున్న బెల్టే’ అంటూ సాగే పాటలో రామ్, ఊర్వశి రౌతేలా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి.  

‘మీసమిలా మెలిపెడితే కల్ట్.. నేను కాలర్ ఇలా ఎగరేస్తే కల్ట్’ అంటూ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశాడు. తమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ నెంబర్‌‌‌‌ను హేమ చంద్ర, రమ్య బెహరా, మహా కలిసి పాడారు.  శ్రీలీల, సయి మంజ్రేకర్ హీరోయిన్స్‌‌గా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 28న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.