హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుస్పెయిన్ పర్యటనకు వెళ్లారు. మాడ్రిడ్ లో ఈ నెల 24 నుంచి 28 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ టూరిజం ట్రేడ్ ఫేయిర్ లో మంత్రి పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను వివరించనున్నారు. అత్యధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించనున్నారు.
జూపల్లి పర్యటనతో తెలంగాణలో పర్యాటక రంగానికి మరింత ఊతం లభించనుంది. వివిధ దేశాల నుంచి పర్యాటకులు తెలంగాణను సందర్శించే అవకాశాలు మెరుగుపడనున్నాయి. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె.నిఖిల, ఎండీ రమేశ్ నాయుడు కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు.
