Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తున్న 2018 సాండ్‌పేపర్ (బాల్ ట్యాంపరింగ్) వివాదంపై ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) ఈరోజు (నవంబర్ 13, శుక్రవారం) ఉదయం మీడియాతో మాట్లాడారు. మాజీ సహచర ఆటగాడు ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ 'సబర్' (Sabr) లో చేసిన సంచలన ఆరోపణలను కమిన్స్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలన్నీ పూర్తి అబద్ధమని, నిరాధారమని ఆయన తేల్చి చెప్పారు.
ఖవాజా ఆరోపణలపై కమిన్స్ ఏమన్నారంటే?:
* నాకు ఎలాంటి సమాచారం లేదు: ఆ రోజుల్లో ఫీల్డ్‌లోకి సాండ్‌పేపర్ తీసుకెళ్తున్న విషయం మా అందరికీ తెలుసు అని ఖవాజా అనడంలో అర్థం లేదని కమిన్స్ పేర్కొన్నాడు. అలా చెబితే అది 100 శాతం తప్పు, గత ఎనిమిదేళ్లుగా నేను ఇదే చెబుతున్నాను.. ఆ సమయంలో ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదన్నాడు.
* పూర్తిగా అవాస్తవం: నాతో పాటు మరికొందరు బాల్ ట్యాంపరింగ్ పథకానికి సూత్రధారులని ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నాడు. అది పూర్తిగా నిరాధారమైన అబద్ధం అని కమిన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
* స్నేహితుడే అయినా షాక్ తగిలింది: ఉస్మాన్ నాకు మంచి స్నేహితుడే.. కానీ, ఒకరి జీవితాలతో, ప్రతిష్టతో ఇలా ఆడుకోవడం సరికాదు.. కెమెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను అప్రమత్తంగా ఉండమని తాను చెప్పినట్లు ఖవాజా ఈ పుస్తకంలో వెల్లడించడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కమిన్స్ చెప్పాడు.
Pat Cummins: "When (Usman Khawaja) says 'we all knew', if by that he means that we knew sandpaper was going out on the field, he's 100 percent wrong." https://t.co/gmmCqhXGkI
— 7Cricket (@7Cricket) November 12, 2026
చట్టపరమైన చర్యలు ఉండవు.. ముందుకు సాగడమే ముఖ్యం:
ఖవాజా చేసిన ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నప్పటికీ, ఆయనపై ఎలాంటి లీగల్ యాక్షన్ (న్యాయపరమైన చర్యలు) తీసుకోబోనని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్పష్టం చేశారు. గతం గురించి ఆలోచించడం మానేసి, ఇకపై ముందుకు సాగడమే ప్రస్తుతానికి సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వివాదం వెలుగుచూడటంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన నిషేధం విధించిన విషయం తెలిసిందే.
PAT CUMMINS RESPONSE...!!! 🗣️ - It's complete nonsense, Whatever Usman Khawaja has mentioned, Cummins on Press. https://t.co/d2368CC5h9
— Johns. (@CricCrazyJohns) November 13, 2026
