
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ఇండియాతో జరిగే మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా ఆసీస్‌కు వెళ్లిపోయిన అతను ఇంకా ఇండియాకు తిరిగి రాలేదు. తల్లి ఆరోగ్యం విషమంగా ఉండటంతో మరికొన్ని రోజులు అక్కడే ఉండాలని కమిన్స్ డిసైడయ్యాడు. దీంతో నాలుగో టెస్ట్‌కు కూడా అతను అందుబాటులో ఉండటంపై డౌట్స్ మొదలయ్యాయి. ఇప్పటికైతే దీనిపై అధికారిక సమాచారం లేదు. కమిన్స్ గైర్హాజరీతో స్టీవ్ స్మిత్.. ఆసీస్ టీమ్‌కు నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు చేతి వేలి గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఇక, కమిన్స్ ప్లేస్‌లో మిచెల్ స్టార్క్ తుది జట్టులోకి రానున్నాడు.