Valentine's Day Special : ప్రేమ ఓ ప్రేమ అంటున్న గూగుల్ డూడుల్

Valentine's Day Special : ప్రేమ ఓ ప్రేమ అంటున్న గూగుల్ డూడుల్

ప్రేమికులకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 14  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు లవర్స్ డే జరుపుకుంటారు. అందరితోపాటు ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ కూడా వాలంటైన్స్ జరుపుకుంటోంది. అది కూడా తన డూడుల్  లో ఒక గేమ్ క్రియేట్ చేసి యూజర్స్ ను త్రిల్ చేస్తోంది. ప్రేమికుల రోజు గూగుల్ తో గేమ్ ఏంటని అనుకుంటున్నారా? హూమన్స్ ఎమోషన్ వెనుక కెమిస్ట్రీ ఫార్ములాలు దాగిఉంటాయని అందరికి తెలుసు అయితే అలాంటి ప్రయోగమే గూగుల్ తన డూడుల్ తో ఆట రూపంలో చేస్తోంది.

ఆటేంటి.. ఏలా ఆడాలి..?
ప్రేమ అనే హ్యూమన్ ఎమోషన్ ను మించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఆకర్షణ, రొమాన్స్, క్రష్, ప్రేమ అనే భావాలకు కారణమయ్యేది హార్మోన్లు, రసాయనాలేనని సెంటిఫిక్ గా రుజువైంది. మన మూడ్ కు కారణమైయ్యే  డోపమైన్, ఆక్సిటోసిన్, ఆడ్రినలిన్ వంటి హార్మోన్ల స్రావానికి కారణం కావచ్చు. ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే రోజు గూగుల్ డూడుల్ లో ప్రేమ భావన వెనుక దాగిన శాస్త్రీయ కారణాలను, రొమాన్స్ కు ప్రేరేపించే కెమిస్ట్రీని వివరించారు.

ALSO READ :- Happy Valentine's Day : ఈ రోజును ప్రేమకు ఇచ్చేయండి

గూగుల్ ఇంటర్ ఫేస్ లోని డూడుల్ లో ఉన్న  ప్లే బటన్ క్లిక్ చేయండి. దీనిలో మీరు ఆవర్తన పట్టిక (periodic table) నుండి ఒక అవతార్ ను ఎంచుకోండి. మీరు ఎలాంటి వారు అనే టాపిక్స్ మీరు గూగుల్ మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతోంది. వాటిని ఆన్సర్స్ సెలక్ట్ చేసుకుంటూ ఆట ఆడాలి. మీ స్వభావంతో ఉన్న కెమికల్స్ ని చివరికి సూచిస్తోంది.  ఇదే గూగుల్ డూడుల్ గేమ్.