కరెంట్ బిల్లు రూ.6 ,93,833... దవాఖానలో చేరిన బాధితుడు

కరెంట్ బిల్లు రూ.6 ,93,833... దవాఖానలో చేరిన బాధితుడు

కొండాపూర్, వెలుగు: ఎప్పుడూ వందల్లో వచ్చే కరెంట్ బిల్లు.. లక్షల్లో రావడంతో షాక్‌‌ తిన్న ఓ బాధితుడు దవాఖాన పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన వడ్ల భాస్కర్‌‌‌‌చారికి  మే నెలకు సంబంధించిన కరెంట్‌‌ బిల్లు రూ.6 ,93,833 కట్టాలని మెసేజ్​ వచ్చింది. ఇది చూసి షాక్‌‌ తిన్న భాస్కర్‌‌‌‌ కు కళ్లు తిరిగాయి.

వెంటనే దవాఖానాకు వెళ్లడంతో  సమస్య తెలుసుకున్న డాక్టర్​..‘టెన్షన్​పడడంతోనే ఇలా జరిగింది’ అని చెప్పి ట్రీట్​మెంట్​ఇచ్చి పంపించాడు. విద్యుత్​శాఖ ఏఈకి కంప్లయింట్​ఇవ్వాలని సూచించడంతో  ఏఈ సిద్దేశ్వర్‌‌‌‌కు ఫిర్యాదు చేశాడు. తన ఇంటికి ఏప్రిల్‌‌లో  రూ.1,322 బిల్లు వస్తే మే నెల బిల్లు రూ.6 ,93,833 వచ్చిందని వాపోయాడు. టెక్నికల్‌‌ సమస్యతో అలా వచ్చి ఉంటుందని, పరిశీలించి సరిచేస్తామని ఏఈ హామీ ఇచ్చారు.