- ఆన్లైన్ డార్క్ ప్యాటర్న్స్‌తో కస్టమర్లకు టోపీ
- డాటమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్
న్యూఢిల్లీ:ఆన్‌లైన్ మార్కెట్లలో మోసపూరిత ఇంటర్‌ఫేస్ డిజైన్లు /డార్క్ ప్యాటర్న్స్ వల్ల భారతీయ వినియోగదారులు ఏటా రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్ల వరకు నష్టపోతున్నారని డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది.
దేశంలోని 30.4 కోట్ల మంది ఆన్‌లైన్ కొనుగోలుదారులలో 88 శాతం మంది రహస్య చార్జీలు, బలవంతపు యాడాన్‌లు, సబ్స్క్రిప్షన్ ఉచ్చుల వల్ల నెలకు రూ. 78 నుంచి రూ. 87 వరకు కోల్పోతున్నారు. చెకౌట్ సమయంలో అదనపు రుసుములు వసూలు చేసే డ్రిప్ ప్రైసింగ్ వల్ల 63 శాతం మంది నష్టపోతున్నారు. ఈ–-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అమెజాన్‌ను నమ్ముతామని 50 శాతం మంది తెలిపారు.
ఫ్లిప్‌కార్ట్ పట్ల 41 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ప్రయాణ రంగంలో మేక్ మై ట్రిప్ సురక్షితమైనదిగా గుర్తింపు పొందగా, క్లియర్‌ట్రిప్ హానికరమైనదిగా నిలిచింది. క్విక్ కామర్స్ విభాగంలో బిగ్‌బాస్కెట్ అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. డార్క్ ప్యాటర్న్స్ నియంత్రణలో ప్రస్తుత నిబంధనలు పరిమిత విజయాన్ని మాత్రమే సాధించాయని ఈ నివేదిక పేర్కొంది.
