వచ్చే ఏప్రిల్ నుంచి పెరగనున్న కరెంట్ చార్జీలు

వచ్చే ఏప్రిల్ నుంచి పెరగనున్న కరెంట్ చార్జీలు

హైదరాబాద్‌‌, వెలుగు: వచ్చే ఏప్రిల్ నుంచి కరెంట్ చార్జీలు పెరగనున్నాయి. వినియోగదారులపై యూనిట్‌‌కు 30 పైసల చొప్పున అదనపు భారం పడనుంది. ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో 2023 ఏప్రిల్‌‌1 నుంచి యూనిట్‌‌కు 30 పైసల చొప్పున విద్యుత్‌‌ సంస్థలు పెంచుకునేందుకు ఈఆర్‌‌సీ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. దీంతో ప్రతి నెలా ఈఆర్‌‌సీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండానే కరెంటు చార్జీలు పెంచుకునే వెసులుబాటు కలిగింది. అయితే, నిరుటి నుంచి గృహ వినియోగదారులపై యూనిట్ కు50 పైసలు, కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియోగదారులపై రూ. 1 మేరకు డిస్కంలు పెంచాయి. సర్దుబాటు చార్జీల రూపంలో పెంచుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ప్రస్తుత చార్జీల టారిఫ్ ను వచ్చే ఏడాది కూడా యథాతథంగా కొనసాగిస్తామని తెలిపాయి. ఈ మేరకు 2023–24కు గాను అగ్రిగేట్‌‌ రెవెన్యూ రిక్వైర్‌‌మెంట్‌‌(ఏఆర్‌‌ఆర్‌‌) నివేదికను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌‌(ఈఆర్‌‌సీ) చైర్మన్ శ్రీరంగారావుకు టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌, టీఎస్‌‌ఎన్‌‌పీడీసీఎల్‌‌ ప్రతినిధులు బుధవారం అందజేశారు. 

రాష్ట్రంలో వచ్చే ఏడాదికి కరెంటు కొనుగోళ్ల కోసం రూ.54,060 కోట్లు అవసరం అవుతాయని విద్యు త్‌‌‌‌ సంస్థలు అంచనా వేశాయి. హైదరాబాద్‌‌‌‌ కేం ద్రంగా ఉండే సదరన్‌‌‌‌ డిస్కంకు రూ.36,963 కో ట్లు, వరంగల్‌‌‌‌ కేంద్రంగా ఉండే నార్తర్న్‌‌‌‌ డిస్కంకు రూ.17,095 కోట్లు అవసరమని ప్రపోజల్స్‌‌‌‌లో పేర్కొన్నారు. వినియోగదారులకు కరెంటు సరఫరా చేయడం ద్వారా రూ.43,525 కోట్ల ఆదాయం వస్తుందని మరో రూ.10,535 కోట్లు లోటు ఏర్ప డుతుందని డిస్కంలు అంచనా వేశాయి. ఈ రెవె న్యూ గ్యాప్‌‌‌‌ తో సదరన్‌‌‌‌ డిస్కంకు రూ.3,211 కోట్లు, నార్తర్న్‌‌‌‌ డిస్కంకు రూ.7,324 కోట్లు లోటు ఉంటుందన్నారు. ఎన్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌ పరిధిలో ప్రాజెక్టులు ఉండడంతో విద్యుత్‌‌‌‌ వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయం కంటే రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంటోంది. ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని డిస్కంలు భావిస్తున్నాయి. ఇప్పటికే లాస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ రూ.8,221 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చిందని, ఈ యేడు అదనంగా మరో రూ.2,314 కోట్లు ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది83,113 మిలియన్‌‌‌‌ యూనిట్ల కరెంటు అవసరమని, 73,618 మిలియన్‌‌‌‌ యూనిట్లు వినియోగదారులకు సరఫరా చేస్తామని మరో 9,495 మిలియన్‌‌‌‌ యూనిట్లు సరఫరాలో నష్టాలు ఎదుర్కొంటామని పేర్కొన్నాయి. మొత్తంగా11.42 శాతం సరఫరా నష్టాలు వుంటాయని ఏఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ నివేదికలో స్పష్టం చేశాయి. 

సరఫరా వ్యయం పెంపునకు ప్రపోజల్   

నిరుడు కరెంటు సరఫరా వ్యయాన్ని రూ.7.03గా ఈఆర్‌‌‌‌సీ నిర్ధారించింది. వచ్చే 2023–24 ఆర్థిక సంవత్సరంలో దీనిని మరో 31పైసలు అదనంగా రూ.7.34కు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఈఆర్‌‌‌‌సీ దీనిపై బహిరంగ విచారణ చేపట్టి సర ఫరా వ్యయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే సరఫరా వ్యయం ఏమాత్రం పెంచడానికి  ఈఆర్‌‌‌‌సీ అనుమతించినా ఆటోమేటిక్‌‌‌‌గా వినియోగదారులపై విద్యుత్‌‌‌‌ చార్జీల భారం పడే అవకాశం ఉంది. 

వినియోగదారులపై అదనపు భారం 

సర్దుబాటు చార్జీల పేరుతో యూనిట్‌‌‌‌కు 30 పైసలు పెంచుకోవడానికి ఈఆర్‌‌‌‌సీ అనుమతించడంతో ఇప్పటికే గత ఏప్రిల్‌‌‌‌1 నుంచి పెంచిన చార్జీలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఒక వినియోగదారుడు వంద యూనిట్లు వాడుకుంటే వచ్చే ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి అదనంగా మరో రూ.30 పడనుంది. అదేవిధంగా స్లాబ్‌‌‌‌ పెరిగి, టారిఫ్‌‌‌‌ కూడా పెరుగుతుంది. స్లాబ్‌‌‌‌ దాటితే రీడింగ్‌‌‌‌తో లెక్కగట్టి భారీగా బిల్లులు వడ్డించనున్నారు.

పథకాలకు యథాతథం 

రాష్ట్రంలో 27.62 లక్షల అగ్రికల్చర్‌‌‌‌ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌‌‌‌ కొనసాగుతుందని ఈఆర్‌‌‌‌సీ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు101 యూనిట్ల వరకు, హెయిర్‌‌‌‌ కటింగ్‌‌‌‌ సెలూన్‌‌‌‌లకు, రజకులకు 250  యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌‌‌‌ కొనసాగించనున్నారు. పౌల్ట్రీ, పవర్‌‌‌‌ లూమ్స్‌‌‌‌, స్పిన్నింగ్‌‌‌‌ మిల్లులకు యూనిట్‌‌‌‌కు రూ.2 యథాతథంగా అమలు చేయనున్నారు. 

ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లకు మీటర్లు పెట్టాలి: ఈఆర్‌‌‌‌సీ చైర్మన్‌‌‌‌  

అగ్రికల్చర్‌‌‌‌ వినియోగదారులపై కచ్చితమైన లెక్క పత్రం లేనందున మోటర్ల వద్ద మీటర్లు కాకుండా వ్యవసాయానికి సరఫరా అయ్యే ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేయాలని ఈఆర్‌‌‌‌సీ చైర్మన్‌‌‌‌ శ్రీరంగరావు డిస్కంలను ఆదేశించారు. 2024 డిసెంబర్‌‌‌‌ నాటికల్లా ట్రాన్స్‌‌‌‌ ఫార్మర్ల వద్ద కరెంటు మీటర్ల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. డిస్కంలు సరఫరా నష్టాల(ఏటీఎండ్‌‌‌‌ సీ)ను15 శాతానికి తగ్గించాలని చెప్పారు. ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఏఆర్‌‌‌‌ఆర్‌‌‌‌లో నష్టాలను చేరిస్తే పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ) పేరిట అదనపు వసూళ్ల కోసం ప్రత్యేక అకౌంట్‌‌‌‌ను ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రైవేటు డిస్కంల ప్రపోజల్స్‌‌‌‌ వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని చైర్మన్‌‌‌‌ వెల్లడించారు. ఏఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పై త్వరలో పబ్లిక్‌‌‌‌ హియరింగ్‌‌‌‌ వివరాలు వెల్లడిస్తామన్నారు. వినియోగదారుల అభ్యంతరాలు రాతపూర్వకంగా తెలిపి వాదనలు వినిపించవచ్చని తెలిపారు. డిస్కంలు టారిఫ్‌‌‌‌ పెంచాలని చెప్పినట్లు తమ నోటీస్‌‌‌‌కు రాలేదన్నారు.