
- పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి హెచ్ఎండీఏ నిర్ణయం
- రూ.30 కోట్లు ఖర్చుఅవుతుందని అంచనా
- ఆసక్తి గల సంస్థలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రోజూ అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్రైల్వేస్టేషన్పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో పాటు రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా స్కై వాక్ నిర్మించాలని హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముఖ్యంగా రైల్వే ప్రయాణికులు స్టేషన్‌లోపలికి వెళ్లాలంటే ట్రాఫిక్పద్మవ్యూహాన్ని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ తిప్పలు తప్పించడంతో పాటు మరో 30 ఏండ్ల పాటు ట్రాఫిక్ సమస్య లేకుండా బస్సు, మెట్రో స్టేషన్ల నుంచి కూడా ప్రయాణికులునేరుగా రైల్వేస్టేషన్‌లోకి వెళ్లే విధంగా స్టేషన్నాలుగు దిక్కులను కలుపుతూ స్కైవాక్నిర్మించాలని హెచ్ఎండీఏ ప్రపోజల్స్రెడీ చేసింది.
స్టేషన్లోకి వెళ్లాలంటే కష్టమే..
సికింద్రాబాద్‌రైల్వేస్టేషన్ నుంచి రోజుకు దాదాపు 80 ఎక్స్‌ప్రెస్, మరో 100 ప్యాసింజర్ రైళ్లు వచ్చి పోతుంటాయి. ఈ రైల్వేస్టేషన్నుంచి రోజుకు 2 నుంచి 3లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు దాదాపు 3.5లక్షల మంది వరకు వచ్చి పోతుంటారు. ఈ స్టేషన్అవతల ఉన్న ఆర్టీసీ బస్టాపుల నుంచి దాదాపు వెయ్యి వరకు బస్సులు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. వీరంతా రైల్వే స్టేషన్నుంచి బయటకు రావాలన్నా, లోపలకు వెళ్లాలన్నా సమస్యే ఉంది.
మెట్రోకు సంబంధించి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో రైల్వేస్టేషన్నుంచి రేతిఫైల్ సెకండ్ఫ్లోర్కు మాత్రమే కనెక్టివిటీ ఉంది. వీరు మళ్లీ కిందకు దిగి రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. దీంతో కొన్ని సందర్భాల్లో రైలు అందుకోవడానికి ఆలస్యమవుతున్నది. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లోకి వెళ్లే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్ నంబర్1 నుంచి కానీ10 (బోయగూడ) నుంచి లోపలికి వస్తుంటారు. కానీ, కొన్ని సార్లు టికెట్లు కొనుగోలుచేసి లోపలికి వెళ్లేసరికి రైళ్లు అందుకోలేకపోతుంటారు. ఇలాంటి పరిస్ధితిని నివారించడానికి హెచ్ఎండీఏ అధికారులు రైల్వేస్టేషన్‌ను అనుసంధానిస్తూ స్కైవాక్నిర్మించాలని ప్రతిపాదించారు.
800 మీటర్ల పరిధిలో...
ప్రస్తుతం నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్చౌరస్తాలో హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్మంచి ఫలితాలను ఇస్తోందని అధికారులు చెప్తున్నారు. స్కైవాక్ నిర్మాణం తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తగ్గాయంటున్నారు. అలాగే, మెహదీపట్నం చౌరస్తాలోనూ హెచ్ఎండీఏ నిర్మిస్తున్న స్కైవాక్ తుదిదశకు చేరుకుంది. దీన్ని త్వరలో ప్రారంభించనున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్సెంటర్లోనూ స్కైవాక్ నిర్మిస్తే చాలా వరకు ట్రాఫిక్ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తున్నారు. స్టేషన్నుంచి 800 మీటర్ల పరిధిలో ఈ స్కైవాక్నిర్మించే ప్లాన్‌లో ఉన్నారు. దీనికి దాదాపు రూ. 35 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేస్తున్నారు.
ఆహ్లాదకరంగా కూడా..
కేవలం రైలు ప్రయాణికులే కాకుండా సమీప ప్రాంతాల్లోని ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు కూడా ఈ స్కైవాక్ ఉపయోగించుకునేలా నిర్మిస్తున్నారు. స్కైవాక్ పైన సందర్శకులు కూర్చునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు. ప్రైవేట్భాగస్వామ్యంతో నిర్మిస్తున్న కారణంగా ప్రైవేట్‌సంస్థలకు స్కైవాక్పై కాఫీషాప్‌లు, ఫుడ్‌కోర్టులు, షాపింగ్వంటివి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. దీంతో షాపింగ్చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాయంత్రం వేళల్లో, సెలవుదినాల్లో ఫ్యామిలీతో కలిసి కూడా స్కైవాక్పై ఎంజాయ్ చేయొచ్చంటున్నారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ పనులు పూర్తయ్యేలోపు స్కైవాక్ పనులు కూడా ప్రారంభించాలని హెచ్ఎండీఏ భావిస్తోంది.
ఏ వైపు నుంచి వచ్చినా డైరెక్ట్ స్టేషన్‌లోకే..
రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా అంటే ఈస్ట్ వైపున ఇప్పటికే రేతిఫైల్బస్స్టేషన్కు ఈస్ట్మెట్రోస్టేషన్కు కనెక్టివిటీ ఉంది. అలాగే, ముషీరాబాద్వైపు నుంచి, ఉత్తరాన క్లాక్టవర్ప్రాంతం నుంచి, వెస్ట్సైడ్మోండా మార్కెట్‌వైపు నుంచి, సౌత్సైడ్బోయిగూడ ప్రాంతాలను కలుపుతూ నేరుగా రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేలా ఈ స్కైవాక్ నిర్మించనున్నారు. అంటే ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైలు ప్రయాణికులు నేరుగాస్కైవాక్ద్వారా రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది. నాలుగు వైపుల నుంచి బస్స్టేషన్లకు, మెట్రోకు అనుసంధానం చేస్తూ ఈ స్కైవాక్ఉంటుంది. రైల్వేస్టేషన్బయట కూడా పాదచారులకు ఏ ఇబ్బంది లేకుండా స్కైవాక్ద్వారా వెళ్లే ఛాన్స్ఉంటుంది.