
కమలాపూర్, వెలుగు: ఆర్టీసీ బస్సుపై కరెంట్పోల్విరిగిపడింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. హనుమకొండ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జమ్మికుంట నుంచి కమలాపూర్ మండలం ఉప్పల్ వైపు 35 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఉప్పల్ నుంచి భీంపల్లిమధ్య మెయిన్‌రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు పనుల కారణంగా కొంతకాలం క్రితమే కరెంట్ పోల్స్వంగిపోయి ప్రమాదకరంగా మారాయి. స్థానికులు సంబంధిత శాఖ ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదు. పల్లె వెలుగు బస్సు ఉప్పల్క్రాస్రోడ్డు దగ్గర కరెంట్‌పోల్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో పోల్విరిగి బస్సుపై పడింది. అక్కడున్నవారు విద్యుత్‌సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పడంతో సరఫరా నిలిపివేశారు. వెంటనే బస్సు డ్రైవర్, కండకర్ట్ ప్రయాణికులను దించేయడంతో ప్రమాదం తప్పింది