వినాయక మండపం ఏర్పాటు చేస్తుంటే కరెంట్ షాక్ 

 వినాయక మండపం ఏర్పాటు చేస్తుంటే కరెంట్ షాక్ 

సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గురుకుల పాఠశాలలో వినాయక చవితి రోజున అపశృతి చోటు చేసుకుంది. గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తో విద్యార్థి మృతి చెందాడు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం పాపన్నపేట గ్రాానికి చెందిన సాయి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు మండపం ఏర్పాటు చేస్తుంటే వెళ్లిన సాయి కరెంట్ షాక్ కు గురయ్యాడు. వెంటనే గుర్తించినా ప్రయోజనం లేకపోయింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సాయి మృతదేహాన్ని జహీరాబాద్ ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.