
ప్రస్తుతం ప్రపంచంలో విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పోరాడేందుకు నిర్దిష్ట బూస్టర్ డోసులు అవసరంలేదని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బూస్టర్ షాట్లు ఓమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఫైజర్ మరియు బయోఎన్‌టెక్ నుండి వచ్చిన వ్యాక్సిన్లు ఒమిక్రాన్ ను అరికట్టగలవని.. ఈ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ నుంచి గణనీయమైన రక్షణను అందిస్తాయని ఫౌసీ చెప్పారు. ‘మన బూస్టర్ వ్యాక్సిన్ నియమాలు ఒమిక్రాన్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ సమయంలో నిర్దిష్ట బూస్టర్ అవసరం లేదు’ అని వైట్ హౌజ్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో ఫౌసీ అన్నారు.
For More News..
హైదరాబాద్ లో కంటైన్‌మెంట్ జోన్
ఒమిక్రాన్ కు మరో మూడు కొత్త లక్షణాలు