"కస్టడీ " టీజర్.. యాక్షన్ లుక్‌‌‌‌‌‌‌‌లో చైతూ

"కస్టడీ " టీజర్.. యాక్షన్ లుక్‌‌‌‌‌‌‌‌లో చైతూ

నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు  రూపొందిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసి  పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్..  గురువారం  టీజర్ రిలీజ్ చేసి, సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. 

‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళుతుంది. అది ఇప్పుడు నన్ను ఓ యుద్ధానికి తీసుకొచ్చింది . ఇక్కడ నన్ను చావు వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు , ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్.. దట్ ట్రూత్ ఈజ్ ఇన్ మై ‘కస్టడీ’’ అంటూ నాగచైతన్య చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. చైతూ యాక్షన్ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపించాడు. విలన్‌‌‌‌‌‌‌‌గా అరవింద్ స్వామి, స్టైలిష్ లుక్‌‌‌‌‌‌‌‌లో శరత్‌‌‌‌‌‌‌‌కుమార్ ఇంప్రెస్ చేస్తున్నారు. మే 12న సినిమా విడుదల కానుంది.