ఫుడ్డుకు మతం లేదు..కస్టమర్​ రిక్వెస్ట్​కు జొమాటో రిప్లై

ఫుడ్డుకు మతం లేదు..కస్టమర్​ రిక్వెస్ట్​కు జొమాటో రిప్లై

డెలివరీ బాయ్​నైనా మార్చండి. లేదా నా ఆర్డరైనా​క్యాన్సిల్​ చేయండి” ఇదీ ముస్లిం డెలివరీ బాయ్​ను అలాట్​ చేసినందుకు ఓ వ్యక్తి జొమాటోకు పెట్టిన రిక్వెస్ట్​. ఢిల్లీకి చెందిన అమిత్​ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్​ ఆర్డర్​ పెట్టాడు. ముస్లిం డెలివరీ బాయ్​ను అలాట్​ చేయడంతో అతడిని మార్చాలని డిమాండ్​ చేశాడు. శ్రావణ మాసం వచ్చిందని, ముస్లింను కాకుండా వేరే వాళ్లతో ఫుడ్​ పంపించాలని జొమాటోను కోరాడు. అయితే, అందుకు కంపెనీ ఒప్పుకోలేదు. మార్చడం కష్టమని చెప్పింది. క్యాన్సిల్​ చేసుకుంటే ఫుడ్డుకు పెట్టిన డబ్బులు రిటర్న్​ రావని చెప్పింది. అయినా కూడా క్యాన్సిల్​ చేయాల్సిందేనంటూ అతడు ఫుడ్డు వద్దనుకున్నాడు. దానిపై ట్విట్టర్​లో పోస్టూ పెట్టాడు. తమకు నచ్చని వాళ్లతో ఫుడ్డును పంపించేందుకు జొమాటో ఒత్తిడి తెస్తోందని ట్వీట్​ చేశాడు. ఆర్డర్​ రద్దు చేస్తే కనీసం రీఫండ్​ కూడా చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జొమాటో కూడా అతడి ట్వీటుకు దీటుగానే బదులిచ్చింది. ఫుడ్డుకు ఏ మతమూ లేదని, ఫుడ్డే ఒక మతమని తేల్చి చెప్పింది. ‘‘ఇండియా అనే ఐడియా చాలా గొప్పది. అందుకు గర్వపడుతున్నాం. మా వైవిధ్యమైన కస్టమర్లు, భాగస్వాములున్నందుకు మేం గర్వ పడుతున్నాం. మా విలువలను కాదని వచ్చే దేన్నైనా వదులుకునేందుకు మేం వెనుకాడం”  అని జొమాటో సీఈవో దీపీందర్​ గోయల్​ ట్వీట్​ చేశారు.