బ్యాంకులో ఖాతాదారుల డబ్బు గోల్ మాల్.. నలుగురి అరెస్ట్

బ్యాంకులో ఖాతాదారుల డబ్బు గోల్ మాల్.. నలుగురి అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ మణుగూరు బ్యాంకులో  ఖాతాదారుల డబ్బు గోల్మాల్ చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 1.41 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. నిందితుల అరెస్టు సందర్భంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ మణుగూరు పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. 

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు మేనేజర్ రాము, అసిస్టెంట్ మేనేజర్ అక్బర్, క్యాషియర్ రామారావు, అటెండర్ రవీంద్ర కుమార్ బ్యాంకులో అక్రమాలకు పాల్పడ్డారు. రెండు సంవత్సరాలుగా వీరు బ్యాంకు డిపాజిట్ సొమ్మును తప్పుదోవ పట్టిస్తూ మోసాలకు పాల్పడ్డారు.  రూ.2.91కోట్లు దారి మళ్లించినట్లు విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.1. 41 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ నలుగురిని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మణుగూరు ఏఎస్పి శబరీష్, మణుగూరు సిఐ భాను ప్రకాష్, ఎస్సై నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

సూసైడ్ నోట్: ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తాడనే ఆత్మహత్య

క్లైమాక్స్‌కు వచ్చిన తన్నులాట.. తెలంగాణ నువ్వెటు వైపు?

పోలీసుల పేర్లు మా డైరీలో రాసుకుంటాం