క్లైమాక్స్‌కు వచ్చిన తన్నులాట.. తెలంగాణ నువ్వెటు వైపు?

V6 Velugu Posted on Sep 22, 2021

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పుడు వైట్ ఛాలెంజ్ పాపులర్‌‌‌గా మారింది. రాష్ట్ర రాజకీయం ఈ ఛాలెంజ్ చుట్టూనే తిరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు కారణమైన వైట్ ఛాలెంజ్‌పై బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ఛాలెంజ్‌లను హైలెట్ చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 

‘చివరికి మన బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్‌లు తన్నులాటల, పరువు నష్టాల క్లైమాక్స్‌కు వచ్చినయన్నమాట. రైతుల కష్టాలు, పోడు, అసైన్డ్ భూములు, కుంభకోణాలు, నిరుద్యోగ సమస్యల నుంచి మన దృష్టి మళ్లించడం కోసమే ఈ హైడ్రామా! తెలంగాణ నువ్వు ఎటు వైపు? ఈ చెత్త ఛాలెంజ్‌‌ల వైపా? లేక ఛిద్రమైన బతుకుల కోసం నిలబడ్డ బహుజనుల వైపా?’ అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 

For more news: 

వైట్ ఛాలెంజ్ ప్రకంపనలు.. అసలు దీని కథేంది?

సామాన్యులను దహనం చేసి.. స్వామీజీలను ఎందుకు సమాధి చేస్తారంటే?

కాబోయే భర్తతో నటి గోవా ట్రిప్.. కారు బోల్తా పడి మృతి

 

Tagged Telangana, KTR, MP Revanth reddy, Drugs Case, RS praveen kumar, White Challenge

Latest Videos

Subscribe Now

More News