కాబోయే భర్తతో నటి గోవా ట్రిప్.. కారు బోల్తా పడి మృతి

V6 Velugu Posted on Sep 21, 2021

గోవా: మరాఠీ, హిందీ చలన చిత్రాల్లో నటించిన వర్ధమాన నటి ఈశ్వరి దేశ్ పాండే (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈనెల 15న తనకు కాబోయే భర్త అయిన శుభమ్ డెడ్జ్ తో కలసి హాలిడే ట్రిప్ కోసం గోవా వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న కారు నిన్న సోమవారం తెల్లవారుజామున అర్పారో గ్రామానికి సమీపంలోని బాగా-కలాంగుట్‌ బ్రిడ్జిపై అదుపుతప్పింది. పక్కన నీటి కుంటలోకి వీరి కారు పడిపోయింది. కారులో ఉన్న వీరిద్దరూ బయట పడలేక ప్రాణాలు కోల్పోయారు.

హిందీ, మరాఠీ సినిమాలు చేస్తున్న ఈశ్వరి(25) తన స్నేహితుడైన శుభమ్ డెడ్జ్ (28)ను ప్రేమించి పెళ్లాడబోతోంది. చాన్నాళ్లుగా వీరి మధ్య పరిచయం స్నేహంగా..  ప్రేమగా మారింది. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వచ్చే నెలలోనే నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఈశ్వరి నటించిన పలు సినిమాలు త్వరలో విడుదల అవుతుండడంతో సరదాగా ఎంజాయ్ చేసేందుకు కాబోయే భర్తను తీసుకుని గోవాకు వెళ్లిన ఈశ్వరి కారు ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

ఈ ప్రమాదం ఇరువైపులా కుటుంబాల్లో తీరని విషాదం రేపింది. సరదాగా వెళ్లిన వారు సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే శవాలై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుంటలో నుంచి కారును బయటకు తీసి..  మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి కుటుంబాలకు అప్పగించారు. 

మరిన్ని వార్తల కోసం..

సూసైడ్ నోట్: ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తాడనే ఆత్మహత్య

క్లైమాక్స్‌కు వచ్చిన తన్నులాట.. తెలంగాణ నువ్వెటు వైపు?

పోలీసుల పేర్లు మా డైరీలో రాసుకుంటాం


 

Tagged , marathi actress Ishwari Deshpande, car accident Goa, went out to hang out, Ishwari Deshpande, marati actress, car pluges into creek, hindi actress

Latest Videos

Subscribe Now

More News