శంషాబాద్ ఎయిర్​పోర్టులో కిలో బంగారం, యానిమల్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్​పోర్టులో కిలో బంగారం, యానిమల్స్ పట్టివేత

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టులో శుక్రవారం భారీగా బంగారం, యానిమల్స్​పట్టుబడ్డాయి. ఇద్దరు ప్రయాణికుల నుంచి వీటిని వేర్వేరుగా స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శుక్రవారం రాత్రి వెల్లడించారు. కేరళ లోని కోజికోడ్ నుంచి ఇండిగో విమానంలో సిటీకి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 933 గ్రాముల అక్రమ గోల్డ్​బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ 73,89 లక్షలకు పైగా ఉంటుందన్నారు. అలాగే బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద విషసర్పంతోపాటు ఇంకో రెండు జంతువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.