‘మా’ ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్

‘మా’ ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్

‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన సీవీఎల్ నరసింహరావు తన పోటీని విరమించుకున్నారు. ‘మా’ అసోసియేషన్ అభివృద్ది కోసం, సభ్యుల సంక్షేమం కోసమే తాను పనిచేస్తానని, అందుకే పోటీ నుంచి తప్పుకున్నానని ఆయన తెలిపారు. దాంతో ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటీపడనున్నాయి. రెండు ప్యానెళ్ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వేడెక్కిస్తున్నాయి. మా ఎన్నికల్లో పోటీచేస్తానన్న బండ్ల గణేశ్.. ప్రకాశ్ రాజ్ కు మద్ధతిస్తున్నట్లు ప్రకటించాడు.