ODI World Cup 2023: టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన బంగ్లా కెప్టెన్

ODI World Cup 2023: టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన బంగ్లా కెప్టెన్

ఒకవైపు వరల్డ్ కప్ మ్యాచ్‌లు హోరాహోరీసాగుతుంటే.. మరోవైపు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్‌ అల్‌ హసన్‌ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. షకీబ్‌‌తో పాటు అతని ట్రైనర్‌ నజ్ముల్ అబీదీన్ సైతం ఢాకా వెళ్లాడు. వీరిద్దరూ విమానంలో కాకుండా ట్రైన్‌లో తమ మాతృదేశానికి బయలుదేరి వెళ్లారు. షకీబ్‌ అంత అత్యవసరంగా ఎందుకు స్వదేశానికి వెళ్లారన్నది తెలియరాలేదు.

ఈ టోర్నీలో బంగ్లా బంగ్లాదేశ్‌కు సెమీస్‌ చేరే అవకాశాలు పెద్దగా లేకపోయినా.. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలంటే.. షకీబ్‌ జట్టులో ఉండాల్సిందే. అందునా అతడు బంగ్లా జట్టు కెప్టెన్. మరో రెండు రోజుల్లో(అక్టోబర్ 28) ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ సమయంలో అతడు జట్టును వదిలి స్వదేశానికి ఎందుకు వెళ్లాడన్నదానిపై ఎవరూ నోరు మెదపడం లేదు. నివేదికల ప్రకారం.. ఏదో అత్యవసర పనిపైనే అతను ఢాకా వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. నెదర్లాండ్స్ మ్యాచ్ నాటికి అతడు జట్టుతో కలవనున్నాడని సమాచారం.

ఇప్పటివరకూ ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్‌ ఒక విజయాన్ని మాత్రమే అందుకుంది. ఈ నెల 28న నెదర్లాండ్స్‌తో, 31న పాకిస్థాన్‌తో, నవంబర్ 6 శ్రీలంకతో, నవంబర్ 11న ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ ఆడాల్సివుంది. ప్రస్తుతానికి బంగ్లా 4 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.

ALSO READ :- మిస్టరీ : అమెజాన్ అడవుల్లో రాళ్లపై మనిషి ముఖాలు