
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో పహల్గాం టెర్రర్అటాక్, కులగణన వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్‌తో పాటు కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.
గురువారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రస్తుతం దేశం ముందున్న రెండు కీలక అంశాలపై చర్చిస్తుందని తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై చర్య తీసుకోవాలని, కులగణనను త్వరగా నిర్వహించడానికి నిధులు కేటాయించాలని కోరుతూ తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉందన్నారు.