
న్యూఢిల్లీ : కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆదివారం భేటీ కానుంది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈ మీటింగ్ వర్చువల్‌గా జరుగుతుంది. వైద్య పరీక్షల కోసం సోనియా గాంధీ విదేశాలకు వెళ్లడం, ఆమె వెంట రాహుల్, ప్రియాంకలు కూడా వెళ్లడంతో ఈ మీటింగ్‌ను వర్చువల్‌గా నిర్వహిస్తారని సమాచారం. ఈ మీటింగ్‌లో ప్రధానంగా అధ్యక్ష ఎన్నికపైనే చర్చిస్తారు. పార్టీ ప్రెసిడెంట్ పదవిని అశోక్ గెహ్లాట్ కాదనడంతో అధ్యక్ష ఎన్నిక నిర్వహణపై అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. గులాంనబీ ఆజాద్ రాజీనామా చేయడం కూడా పార్టీని కొంత ఇబ్బందికి గురి చేసిందనే చెప్పాలి. దీంతో వెంటనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుని పార్టీని గాడినపెట్టే అంశంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఈ సీడబ్ల్యూసీలో సీనియర్ నేతలతో సంప్రదించి షెడ్యూల్ ప్రకటించే చాన్స్ ఉంది. అక్టోబర్ కల్లా పూర్తికాల అధ్యక్షుడిని నియమించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.