అలర్ట్.. అనుమానాస్పద లింక్స్ ఓపెన్ చేయకండి

అలర్ట్.. అనుమానాస్పద లింక్స్  ఓపెన్ చేయకండి

సిమ్ స్వాపింగ్ కు పాల్పడుతున్న ముంబైకి చెందిన మీరారోడ్డు గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు నైజిరియా వ్యక్తి జేమ్స్ అని మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. ఈ ముఠా నైజిరియా నుంచి హ్యాకింగ్ చేస్తున్నారన్నారు. ముందు ఫోన్ కు లింక్ పంపిస్తారు..ఆ తర్వాత లింక్ ను ఓపెన్ చేస్తే మన డీటైల్స్ వాళ్లకు వెళ్తాయన్నారు. ఫస్ట్ మన సిమ్స్ ను బ్లాక్ చేసి.. తర్వాత ఫేక్ డాక్యమెంట్లతో సిమ్ లను యాక్టివేట్ చేస్తారన్నారు. ఇలా 40 ఫేక్ ఆధార్ కార్డులు సీజ్ చేశామన్నారు. ముంబై నుంచి ఈ దందా నడుస్తుందన్నారు. నైజిరియా వ్యక్తి కింద వీళ్లు పనిచేస్తున్నారన్నారు. అనుమానస్పద లింక్స్ ఓపెన్ చేయవద్దన్నారు. సిమ్ బ్లాక్ అయితే వెంటనే స్టోర్ కు వెళ్లాలన్నారు. బ్యాంకు అధికారులకు కూడా సమాచారం ఇచ్చామని..నిత్యం పాస్ వర్డులు ఛేంజ్ చేస్తూ ఉండాలన్నారు సీపీ.

 see more news

సంపదకు సంతోషానికి సంబంధం ఉంటదా?

స్టార్లు మాకొద్దు.. ఫ్రాంచైజీలు వదిలేసిన టాప్ ప్లేయర్లు వీళ్లే..

పాత బస్తీలో సిలిండర్ పేలి 13 మందికి గాయాలు

కొత్త బాస్ ఎన్నికకు లైన్ క్లియర్ అవుతుందా?