
హైదరాబాద్ సిటీ, వెలుగు: సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 10 సైబర్ నేరాలను ఛేదించి, దేశవ్యాప్తంగా 13 మంది నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. ఈ వారంలో 113 కేసులకు సంబంధించి 370 రీఫండ్ ఆర్డర్లను జారీ చేశారమన్నారు. రూ.1.69 కోట్లను ,61,276 బాధితులకు అందజేయనున్నట్లు తెలిపారు.
ఏపీకే ఫైల్స్ పంపి.. ముగ్గురికి టోకరా
బషీర్బాగ్: ఏపీకే ఫైల్స్ పంపించి నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులను సైబర్ చీటర్స్ మోసగించారు. ముషీరాబాద్ కు చెందిన 47 ఏళ్ల వ్యక్తికి స్కామర్స్ ఆర్టీవో ఈ చలాన్ పేరిట ఏపీకే ఫైల్ పంపి రూ.లక్షా 82 వేలు కాజేశారు. ఇదే తరహాలో చుడీబజార్ కు చెందిన 54 ఏళ్ల వ్యక్తి నుంచి రూ.లక్ష, భోలక్ పూర్ కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి నుంచి రూ.2,03,873 కొట్టేశారు.