OTPతో సైబర్ నేరగాళ్లు ఇలా దోచేస్తున్నారు

OTPతో సైబర్ నేరగాళ్లు ఇలా దోచేస్తున్నారు

కస్టమర్ల సౌకర్యం కోసం…అన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి బ్యాంకులు. వినియోగదారులకు నగదు లావాదేవీలు ఈజీ అయ్యాయి. దీన్ని కొంతమంది అక్రమాలు చేస్తూ అడ్డదారిలో డబ్బులు కాజేసుందుకు ఉపయోగిస్తున్నారు. దీంతో రకాల సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. ఎక్కవగా  వన్ టైం పాస్ వర్డ్ ( OTP) తో మోసాలు ఊహించని రీతిలో జరుగుతున్నాయి.

టెక్నాలజీని ఆయుధంగా చేసుకుని… రోజురోజుకు రెచ్చిపోతున్నారు సైబర్ కేటుగాళ్లు. అమాయకులను టార్గెట్ గా చేసుకుని లక్షలు కాజేస్తున్నారు క్రిమినల్స్. ఎక్కవగా గవర్నమెంట్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిసే వీరి టార్గెట్. మీరు బిజీగా ఉన్న టైంలో ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేస్తారు. సర్ నమస్తే దయచేసి మీము చేప్పేది వినండి అంటూ మిమ్మల్ని మాటలతో మోసం చేస్తారు.

ఉద్యోగం కోసం అప్లికేషన్‌ చేసిన అప్లికేషన్ లో నా ఫోన్‌ నంబర్‌ కు బదులు పొరపాటుగా మీ నంబర్‌ రాశాను సర్. ఇద్దరిదీ ఒకే రకమైన సిరీస్ నెంబర్ కావడంతో అందులో ఒక నంబర్ తప్పుగా రాసినట్లు నమ్మిస్తాడు. అంతేకాదు నా జాబ్‌ ఆఫర్‌ మెసేజ్‌ నీకు వచ్చిందని తెలిసిందని… ఆ రిజిస్టర్‌ నంబర్‌కు మాత్రమే మెసేజ్‌ వస్తుందని కంపెనీ వారు తెలిపారని చెబుతాడు. మెసేజ్‌ చూపించమంటున్నారు… ఆ మెసేజ్‌ ను నా నంబర్‌కు ఫార్వార్డ్‌  చేస్తారా సర్ అని వేడుకుంటాడు. అంతే నమ్మి మెసేజ్  పంపించిన క్షణాల్లోనే… మీ బ్యాంక్ అంకౌట్ లో నుండి డబ్బులు కట్ అవుతాయి. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు OTP ని ఇలా వాడుకుంటూ డబ్బులు దోచుకుంటున్నారు.

తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను నమ్మి మోస పోవద్దంటున్ను సైబర్ క్రైం పోలీసులు. ఎలాంటి అనుమానాలున్నా నేరుగా బ్యాంకులకే వెళ్లి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.