Today OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ మూవీస్.. ఇవాళ (ఆగస్టు1) ఒక్కరోజే 15కి పైగా సినిమాలు

Today OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలోకి  ఇంట్రెస్టింగ్ మూవీస్.. ఇవాళ (ఆగస్టు1) ఒక్కరోజే 15కి పైగా సినిమాలు

ప్రతివారంలాగే ఈ శుక్రవారం కూడా (2025 ఆగస్ట్1) ఓటీటీలోకి కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో ఫ్యామిలీ, హారర్, కామెడీ, యాక్షన్ వంటి జోనర్స్లో 15కి పైగా సినిమాలు స్ట్రీమింగ్కి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలన్నీ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌, జీ5, ఈటీవీ విన్, ఆపిల్ ప్లస్ టీవీ, సోనీ లివ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లలో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.. 

అమెజాన్ ప్రైమ్:

3BHK (తెలుగు, తమిళ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా)-ఆగస్టు 1

హౌజ్‌ఫుల్ 5 (హిందీ సస్పెన్స్ కామెడీ)- ఆగస్టు 1

సింప్లీ సౌత్:

3BHK (తెలుగు, తమిళ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా)-ఆగస్టు 1

నెట్‌ఫ్లిక్స్:

తమ్ముడు (తెలుగు యాక్షన్ అడ్వెంచర్)- ఆగస్టు 1

మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్)- ఆగస్టు 1

ఆహా తమిళ్:

చక్రవ్యూహం (తమిళ డబ్బింగ్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్)-ఆగస్టు 1

జియో హాట్‌స్టార్:

సూపర్ సారా (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ మినీ వెబ్ సిరీస్)- ఆగస్టు 1

►ALSO READ | Samantha Raj:సమంత, డైరెక్టర్ రాజ్ మధ్య అసలేం జరుగుతోంది?

ఈటీవీ విన్:

ఓ భామ అయ్యో రామ (తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ)- ఆగస్టు 1

జీ5:

సట్టముం నీతియుం (తెలుగు డబ్బింగ్ తమిళ కోర్ట్ రూమ్ డ్రామా)- ఆగస్టు 1

బకైటి (హిందీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)-ఆగస్టు 1

SUN NXT:

జిన్ ది పెట్ (తెలుగు డబ్బింగ్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్)- ఆగస్టు 1

సురభిల సుందర స్వప్నం (మలయాళ ఫ్యామిలీ డ్రామా)- ఆగస్టు 1

ఆపిల్ ప్లస్ టీవీ:

స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లీష్ యానిమేషన్ కిడ్స్ వెబ్ సిరీస్)- ఆగస్టు 1

చీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ వెబ్ సిరీస్)- ఆగస్టు 1

యూట్యూబ్:

సితారే జమీన్ పర్ (హిందీ స్పోర్ట్స్ కామెడీ డ్రామా)- ఆగస్టు 1

సోనీ లివ్:

ట్విస్ట్‌డ్ మెటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 1

మనోరమ మ్యాక్స్:

సూపర్ జిందగీ (మలయాళ యాక్షన్ అడ్వెంచర్)- ఆగస్టు 1

ఈ లిస్టులో తమ్ముడు, 3BHK, ఓ భామ అయ్యో రామ, చక్రవ్యూహం, సట్టముం నీతియుం, మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్, జిన్ ది పెట్ వంటి  సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తమ్ముడు, 3BHK మూవీస్ కోసం తెలుగు ఆడియన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.