
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, చిత్ర నిర్మాత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు డేటింగ్లో ఉన్నారని చాలాకాలంగా టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని షికార్లు చేయడం, తరచూ ఫొటోలు షేర్ చేయడంతో గాసిప్స్ రెట్టింపు అయ్యాయి. ఇలా వీళ్ళిద్దరూ వరుస వెకేషన్స్, ఈవెంట్స్ లలో కలిసే దర్శనమిస్తుండటం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
లేటెస్ట్గా వీరిద్దరూ మరోసారి కెమెరా కంటికి చిక్కారు. సామ్, రాజ్ ఒకే కారులో వెళ్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముంబైలో రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి వారు కారు ఎక్కుతుండగా, ఫోటోగ్రాఫర్లు ఫోటో తీయడానికి ప్రయత్నించారు. తమ వ్యక్తిగత సేచ్ఛను ఫోటోగ్రాఫర్స్ ఆక్రమించుకోవడంతో డైరెక్టర్ రాజ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సమంత మాత్రం మరింత రిలాక్స్‌గా కనిపించింది. ఈ లేటెస్ట్ వీడియోతో మరోసారి వీళ్లు వార్తల్లో నిలిచారు.
samantha herself was affected by EMA & is now doing same this needs to be called out. she broke their home. pic.twitter.com/kVQjoZzWrP
— Vinita Mishra💫💚 (@sutariasgirl) July 30, 2025
అంతేకాకుండా రీసెంట్ టైమ్స్లో సమంత పోస్ట్ చేసే ఫొటోలే కాదు.. పెట్టె క్యాప్షన్స్ కూడా అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఇటీవలే శుభం రిలీజ్ టైంలో సైతం పలు ఫోటోలు షేర్ చేసింది.
"ఇది చాలా కష్టమైన ప్రయాణం. కానీ ఇక్కడివరకూ చేరుకున్నాం. కొత్త ఆరంభాలు. శుభం మే 9న విడుదలవుతుంది " అని తన పెంపుడు జంతువులు హాష్, శాషాతో దిగిన ఫోటోలు, సినిమా షూటింగ్ సమయంలోని క్షణాలు, ఇతర ఫోటోలను ఆమె పంచుకున్నారు. ఇందులో 'కొత్త ప్రారంభం' అనే క్యాప్షన్ మరియు డైరెక్టర్ రాజ్ ఫోటో ఆసక్తి పెంచేలా చేసింది.
జులై ఫస్ట్ వీక్లో వీరిద్దరూ కలిసి (తానా) 2025 ఎడిషన్‌లో భాగంగా అమెరికాకు వెళ్లారు. ‘మీరు అదృష్టవంతులు కారు.. మీ కష్టానికి ప్రతిఫలం వచ్చింది’అనే క్యాప్షన్ పెట్టి పలు ఫోటోలు పంచుకుంది. ఇందులో ఓ ఫొటోలో వీరిద్దరూ క్లోజ్‌గా ఉండడం, ఒకరిపై ఒకరు చేయి వేసుకుని, ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ వెళ్లడంపై నెటిజన్లు మరోసారి మాట్లాడుకున్నారు. ఇంకో ఫొటోలో సమంత, రాజ్ ఒక రెస్టారెంట్‌లో పక్కపక్కనే కూర్చుని, స్నేహితులతో లంచ్ చేస్తున్నారు.
రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటడెల్ హనీ బన్నీలో’సమంత నటించింది. ఆ ప్రాజెక్టులకు పని చేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. అప్పటి నుంచి డేటింగ్లో ఉన్నారని సమాచారం. కానీ బయటి నుంచి వచ్చే కామెంట్ల గురించి ఇద్దరిలో ఎవరు కూడా ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. డేటింగ్ వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు రాజ్ భార్య పలుసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా కామెంట్ చేసినప్పటికీ వీళ్ళు మాత్రం సైలెంట్గా ఉంటూవస్తున్నారు.
ఇలా వరుస కొత్త ఫొటోలతో గాసిప్స్ రెట్టింపు అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సమంత, డైరెక్టర్ రాజ్ మధ్య అసలేం జరుగుతోంది? అని నెటిజన్లలో చర్చలు మొదలయ్యాయి. మరి వీరిద్దరి మధ్య వచ్చే రూమర్స్కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందనేది తెలియాల్సి ఉంది.