వరంగల్‌లో తెలంగాణ అబ్బాయి.. అమెరికా అమ్మాయి ప్రేమ పెండ్లి

వరంగల్‌లో తెలంగాణ అబ్బాయి.. అమెరికా అమ్మాయి ప్రేమ పెండ్లి

గ్రేటర్​వరంగల్, వెలుగు: తెలంగాణ అబ్బాయి.. అమెరికా అమ్మాయి ప్రేమ పెండ్లితో ఒక్కటయ్యారు.  వరంగల్ సిటీ ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్​గురువారం వేదికగా నిలిచింది. వీరి పెండ్లిని ఇరు కుటుంబాలు.. బంధుమిత్రులు వైభవంగా నిర్వహించారు. వరంగల్​లోని పోచమ్మ మైదానికి చెందిన డాక్టర్ అశోక్, సునీత దంపతుల కొడుకు రితేశ్ నాలుగేండ్ల కింద అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు. 

అతడి క్లాస్ మెట్ పిట్స్ బర్గ్ కు చెందిన జూలియన్ కాలేజీ పరిచయమైంది. అనంతరం ఇరువురి మధ్య ప్రేమగా మారింది.  దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించిన ప్రేమికులు సంప్రదాయ పద్ధతిలో పెండ్లి చేసుకున్నారు.