మందు బాబులకు గుడ్ న్యూస్ : ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే 20 రూపాయలు ఇస్తారు..!

మందు బాబులకు గుడ్ న్యూస్ : ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే 20 రూపాయలు ఇస్తారు..!

ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రూ.800 కంటే ఎక్కువ ధర ఉన్న అన్ని మద్యం బ్రాండ్లను ప్లాస్టిక్ బాటిళ్లలో కాకుండా సీసాలలో మాత్రమే అమ్మనున్నట్లు ఎక్సైజ్ మంత్రి MB రాజేష్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 70 కోట్ల మద్యం సీసాలు అమ్ముడవుతున్నాయి, వీటిలో ఎక్కువ భాగం ప్లాస్టిక్ బాటిళ్లే.

ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్లాస్టిక్ బాటిళ్లకు డిపాజిట్ రీఫండ్ సిస్టమ్ తీసుకొస్తుంది. అంటే ప్లాస్టిక్ బాటిళ్లలో మద్యం కొన్నవారి నుండి డిపాజిట్‌గా మరో రూ.20 అదనంగా ఛార్జ్ చేస్తారు. అయితే ఖాళీ బాటిల్‌ను అదే బెవ్కో అవుట్‌లెట్‌కు తిరిగి ఇస్తే డిపాజిట్‌గా తీసుకున్న రూ.20 తిరిగి ఇచ్చేస్తారు. ఈ రీఫండ్‌ పొందాలంటే బాటిల్ స్టిక్కర్ లేదా లేబుల్ తప్పనిసరిగా ఉండాలి.

క్లీన్ కేరళ కంపెనీ సహకారంతో ఈ పథకం కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్‌లో తిరువనంతపురంలో మొదలుపెట్టనున్నారు. ఈ ప్లాన్ తమిళనాడులో సక్సెస్ కావడంతో కేరళలో కూడా అమలు చేయనున్నారు.  ఇందుకు కేరళ అధికారులు బెవ్కో, ఎక్సైజ్ శాఖ, స్వచ్ఛ మిషన్ భాగస్వామ్యంతో రీసర్చ్ కూడా చేశారు.

రూ.900 కంటే ఎక్కువ ధర ఉన్న విదేశీ మద్యం విక్రయించడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలో 'సూపర్ ప్రీమియం బెవ్కో' అవుట్‌లెట్‌లను తెరవనుంది. ఆగస్టు 5న త్రిస్సూర్‌లో మొదటి అవుట్‌లెట్ లాంచ్ కానుండగా, ఇతర జిల్లాల్లో మరో నాలుగు అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్స్ రెడీ చేసారు. ప్రస్తుతం బెవ్కో స్టోర్‌ల వద్ద భారీ క్యూ లైన్లు, వేటింగ్ సమయాన్ని  తగ్గించచడానికి ఈ చర్య తీసుకుంది.