
kingfisher Beer: చాలా మంది మద్యం ప్రియులకు ఇష్టమైనది బీర్. అందులోనూ కింగ్ ఫిషర్ బీర్లకు ఉండే డిమాండే వేరు. దానిలో ఉండే యునీక్ సాఫ్ట్ టేస్ట్ తమకు బాగా నచ్చుతుందని వినియోగదారులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఒక బీరు రేటు దాదాపు రూ.180గా ఉంది. అయితే ప్రస్తుతం బీర్ రేటు గురించి ఇన్ స్ట్రాలో తెగ చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో సమాచారం ప్రకారం.. మార్కెట్లో కింగ్ ఫిషర్ బీరును ఒక్కోటి రూ.180కి విక్రయిస్తున్నప్పటికీ దాని అసలు రేటు కేవలం రూ.30 అని వారంటున్నారు. అయితే ఈ క్రమంలో మిగిలిన రూ.150 ఎవరికి వెళుతోంది లేదా ఎందుకు ఖర్చవుతోందనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
ALSO READ : AI భర్తీ చేసే 40 జాబ్ రోల్స్ లిస్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్.. ఎఫెక్ట్ కాని 40 జాబ్స్ వివరాలివే..!
ముందుగా విక్రయ రేటులో ఎక్స్సైస్ టాక్స్ ఒక్కో బీరుకు రూ.70, వ్యాల్యూ యాడెడ్ టాక్స్ రూ.35, డిస్ట్రిబ్యూటర్ అండ్ రిటైలర్ మార్జిన్ రూ.20, తయారు చేసే కంపెనీ లాభం రూ.15, రవాణా ఖర్చులు రూ.10 మెుత్తం కలిపితే రూ.150 అవుతోంది. అంటే అసలు బీరు తయారీకి అవుతున్న ఖర్చు కేవలం రూ..30 అన్నమాట. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న ధర కంటే ఇది చాలా తక్కువ. బీరు ప్రియులు అసలు రేటు కంటే ఐదు రెట్లు ఇతర ఖర్చులు ఉన్నాయని.. తాము చెల్లిస్తున్న దానిలో ఎక్కువగా ప్రభుత్వాలకు పన్నుల రూపంలోనే వెళ్లిపోతోందని అంటున్నారు.