
ఏఐ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో అనేక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉపాధి అవకాశాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో ఏఏ ఉద్యోగాలు ప్రభావితం అవుతాయనే అంశంపై మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో ఏఐ వినియోగం, జనరేటివ్ ఏఐ ప్రభావం ఎలాంటి ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుంది, ఎవరు సేఫ్ అనే అంశాలను సుస్పష్టం చేసింది.
ఏఐ కారణంగా ప్రమాదంలో పడే 40 ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రాన్స్ లేటర్స్, పాసింజర్ అటెండెంట్స్, సెల్స్ రిప్రజంటేటివ్స్, రచయితలు, కస్టమర్ సర్వీస్ రిప్రజంటేటివ్స్, సీఎస్సీ టూప్ ప్రోగ్రామర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు, టికెట్ ఏజెంట్స్, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ అనౌన్సర్లు, బ్రోకరేజ్ క్లర్క్స్, ఫార్మ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేటర్లు, టెలీమార్కె్టర్లు, చరిత్రకారులు, పొలిటికల్ విశ్లేషకులు, న్యూస్ అనలిస్టులు, జర్నలిస్టులు, రిపోర్టర్లు, లెక్కల చీటర్లు, టెక్నికల్ రైటర్స్, ప్రూఫ్ రీడర్లు, హోస్ట్స్, ఎడిటర్లు, బిజినెస్ టీచర్లు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు, అడ్వర్టైజింగ్ సేల్స్ ఏజెంట్స్, అకౌంట్ క్లర్క్స్, స్టాటస్టికల్ అసిస్టెంట్లు, డేటా సైంటిట్స్, పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్లు, ఎకనమిక్స్ టీచర్లు, వెబ్ డెవలపర్లు, మేనేజ్మెంట్ అనలిస్టులు, జియోగ్రాఫర్స్, మోడల్స్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, స్విచ్ బోర్డ్ ఆపరేటర్లు, లైబ్లరీ సైన్స్ టీచర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని మైక్రోసాఫ్ట్ స్టడీలో తేలింది.
ఇక ఇదే క్రమంలో ఏఐ వచ్చినప్పటికీ అస్సలు ఫికర్ చెందాల్సిన అవసరం లేని ఉద్యోగాల గురించి కూడా మైక్రోసాఫ్ట్ స్డడీ వెల్లడించింది. చేతి పనుల వారు చాలా తక్కువగా ఏఐ వల్ల మార్పులకు గురికానున్నట్లు ఇందులో తేలింది.
బ్లడ్ శాంపిల్స్ కలెక్టర్స్, నర్సింగ్ అసిస్టెంట్, ప్రమాదకర వస్తువులు తొలగించే వ్యక్తులు, పెయింటర్స్, ఎంబామర్స్, ప్లాంట్ ఆపరేటర్లు, ఓరల్ సర్జన్స్, కార్ గ్లాస్ వర్కర్స్, షిప్ ఇంజనీర్స్, టైర్లకు పంచర్లు వేసే వ్యక్తులు, ప్రొడక్షన్ వర్కర్స్, హైవే మెయింటెనెన్స్ వర్కర్లు, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీదారులు, ప్యాకేజింగ్ వర్కర్లు, అంట్లు తోమేవారు, సిమెంట్ పనిచేసే మేస్త్రీలు, అగ్నిమాపక సూపప్వైజర్, ట్రక్ డైవర్లు, మెడికల్ టెక్నీషియన్లు, మసాజ్ థెరపిస్టులు, టైర్ బిల్డర్లు, గ్యాస్ స్టేషన్ ఆపరేటర్లు, రూఫర్స్, ఇంటి పనివారు, మోటార్ బోట్ ఆపరేటర్లు, హాస్పిటల్ స్టాఫ్, పైప్ డ్రైవర్ ఆపరేటర్లు, రైల్వే లైన్ నిర్మాణ కార్మికులు, ఫౌండ్రీ వర్కర్లు, మినరల్ వాటర్ ప్లాంట్ ఆపరేటర్లు, బ్రిడ్జి లాక్ అటెండర్లు, డ్రెడ్జ్ మిషినరీ ఆపరేటర్ల ఉద్యోగాలకు ప్రమాదం పెద్దగా ఉండనది తేలింది.