
ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ గతంలో ఉన్న పాత ప్లాన్ ధర కంటే కేవలం రూ.1 ఎక్కువ, ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ కాలింగ్, డేటా ఇంకా ఆన్ లిమిటెడ్ 5G నెట్వర్క్ అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్ ద్వారా ఎక్స్ట్రా 14GB డేటా కూడా వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
కొత్త రూ.399 రీఛార్జ్ ప్లాన్: ఎయిర్‌టెల్ కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.399, మొత్తం 28 రోజుల వాలిడిటీ, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, జమ్మూ & కాశ్మీర్ కాకుండా ఫ్రీ నేషనల్ రోమింగ్, ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఉచిత SMSలు అలాగే కంపెనీ 28 రోజుల పాటు జియోహాట్‌స్టార్‌కు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ఇస్తుంది.
1 రూపాయికే 14GB ఎక్స్ట్రా డేటా: ఎయిర్‌టెల్ గతంలో రూ.398 రీఛార్జ్ ప్లాన్‌ను అందించింది, ఇందులో ఆన్ లిమిట్ కాలింగ్, భారతదేశం అంతటా ఫ్రీ నేషనల్ రోమింగ్, ప్రతిరోజు 2GB డేటా, 100 ఫ్రీ SMSలు, ఆన్ లిమిటెడ్ 5G, JioHotstar సబ్‌స్క్రిప్షన్ కూడా అందించింది. అయితే కేవలం ఒక రూపాయి ఎక్స్ట్రా ఖర్చుతో మీరు కొత్త రూ.399 ప్లాన్‌కి అప్‌గ్రేడ్ కావొచ్చు, దీని ద్వారా ప్రతిరోజూ ఎక్స్ట్రా 512MB డేటా పొందవచ్చు. అంటే ఒక నెలలో మీకు రూ.1కే 14GB డేటా వస్తుంది.
TRAI విడుదల చేసిన డేటా ప్రకారం, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కస్టమర్ల సంఖ్యా పెరుగుతుంది. ప్రస్తుతం కంపెనీ యూజర్ల సంఖ్య ఇప్పుడు 360 మిలియన్లను దాటింది. గత నెలలో వోడాఫోన్ ఐడియా (Vi) ఇంకా BSNL 2,00,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లను కోల్పోయాయి. BSNL 1,35,000 కంటే ఎక్కువ మందిని కోల్పోగా, Vi 2,74,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లను కోల్పోయింది.