
Gold Price Today: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై నేటి నుంచి 25 శాతం టారిఫ్స్ ప్రకటించిన నాటి నుంచి గోల్డ్ రేట్లు అనూహ్యంగా పతనాన్ని చూస్తున్నాయి. దీనికి తోడు ట్రంప్ మరిన్ని టారిఫ్స్ పై దూకుడు పెంచటం కొంత ఆందోళనను సృష్టిస్తున్నప్పటికీ.. ఇన్వెస్టర్లు వాటిని నిశితంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. గోల్డ్ కంటే స్టాక్స్ పై మక్కువ చూపుతూ డిప్స్ వద్ద కొనుగోళ్లకు దిగటం పసిడి ప్రియులకు కలిసొస్తోందని నిపుణులు అంటున్నారు. దీంతో తెలుగు ప్రజలు శ్రావణ శుక్రవారం షాపింగ్ కోసం ఆసక్తిగా ఉన్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేల తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 150, ముంబైలో రూ.9వేల 150, దిల్లీలో రూ.9వేల 165, కలకత్తాలో రూ.9వేల 150, బెంగళూరులో రూ.9వేల 150, కేరళలో రూ.9వేల 150, పూణేలో రూ.9వేల 150, వడోదరలో రూ.9వేల 155, జైపూరులో రూ.9వేల 165, లక్నోలో రూ.9వేల 165, మంగళూరులో రూ.9వేల 150, నాశిక్ లో రూ.9వేల 153, అయోధ్యలో రూ.9వేల 165, బళ్లారిలో రూ.9వేల 150, నోయిడాలో రూ.9వేల 165, గురుగ్రాములో రూ.9వేల 165వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2వేల 100 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ విక్రయ రిటైల్ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 982, ముంబైలో రూ.9వేల 982, దిల్లీలో రూ.9వేల 997, కలకత్తాలో రూ.9వేల 982, బెంగళూరులో రూ.9వేల 982, కేరళలో రూ.9వేల 982, పూణేలో రూ.9వేల 982, వడోదరలో రూ.9వేల 987, జైపూరులో రూ.9వేల 997, లక్నోలో రూ.9వేల 997, మంగళూరులో రూ.9వేల 982, నాశిక్ లో రూ.9వేల 985, అయోధ్యలో రూ.9వేల 997, బళ్లారిలో రూ.9వేల 982, నోయిడాలో రూ.9వేల 997, గురుగ్రాములో రూ.9వేల 997గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 500 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 820గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2వేలు తగ్గి రూ.లక్ష 23వేల వద్ద ఉంది.