రైతుబంధు పేరుతో సైబర్ మోసం

రైతుబంధు పేరుతో సైబర్ మోసం

కొడిమ్యాల, వెలుగు: రైతుబంధు పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బు లూటీ చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన గాజర్ల సౌమ్యకు సోమవారం సాయంత్రం ఓ నంబర్‌‌‌‌‌‌‌‌ నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీ అకౌంట్‌‌‌‌కు రూ.21వేల రైతుబంధు డబ్బులు వచ్చాయి. వేరేవారి అకౌంట్‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ ఇస్తే ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌  చేస్తాం’ అని చెప్పాడు.

సౌమ్య కుటుంబ డిటెయిల్స్​, రైతు బీమా వివరాలను పక్కాగా చెప్పడంతో ఆమె నిజమని నమ్మి, తన పక్కనే ఉన్న తాళ్లపల్లి సంధ్య నంబర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఆమె అకౌంట్‌‌‌‌లో రూ.9వేలు వేశానని, అంతకంటే ఎక్కువ జమ కావాలంటే మరొకరి ఖాతా ఇవ్వాలని నమ్మబలికాడు. సంధ్య తన భర్త సుమన్, మరో వ్యక్తి రమేశ్‌‌‌‌ నంబర్​ ఇచ్చారు. ఇలా సంధ్య, సుమన్‌‌‌‌, రమేశ్‌‌‌‌ అకౌంట్ల నుంచి రూ.1,25,408 మాయమయ్యాయి. తర్వాత మోసపోయామని గ్రహించి పీఎస్​లో ఫిర్యాదు చేశారు.