తూప్రాన్ లో ఫేక్ అప్లికేషన్తో రూ.25 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లు

తూప్రాన్ లో ఫేక్ అప్లికేషన్తో రూ.25 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లు

తూప్రాన్, వెలుగు : తూప్రాన్ మండలానికి చెందిన ఓ వ్యక్తి వద్ద షేర్ మార్కెట్ పేరుతో రూ.25 లక్షలు కాజేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం.. మండలానికి చెందిన ఓ వ్యక్తి తన వాట్స్అప్ గ్రూప్​లో వచ్చిన షేర్ మార్కెట్ లింకు ద్వారా రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టాడు. 

అనుమానం వచ్చిన  వ్యక్తి డబ్బులు తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించగా ఎంతకు రాకపోవడంతో మోసపోయినట్లు గమనించాడు. వెంటనే తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఇటువంటి మోసపూరిత చర్యలు జరిగితే వెంటనే 1930 నంబర్​కు సమాచారం ఇవ్వాలని సూచించారు.