సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్.. మాల్వేర్ చొరబడినట్లు అనుమానం..

సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్.. మాల్వేర్ చొరబడినట్లు అనుమానం..

హైదరాబాద్ పోలీసులకు షాక్ ఇచ్చారు హ్యాకర్లు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పోలీస్ శాఖ కృషి చేస్తున్న క్రమంలో భారీ షాక్ ఇచ్చారు హ్యాకర్లు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్ చేశారు హ్యాకర్లు. వారం రోజులుగా వెబ్ సైట్లు పని చేయట్లేదని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల తెలిపాయి. వెబ్ సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నంబర్స్ కూడా హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఇరు కమిషనరేట్ల ఐటీ టీమ్స్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాయి.సైట్ల పునరుద్ధరణ కోసం  నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్  పర్యవేక్షణలో ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు పని చేస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు అవసరమైన సాఫ్ట్వేర్లు అప్డేట్ చేయిస్తున్నారు పోలీసులు.మరోసారి హ్యాకింగ్ కు గురి కాకుండా అధునాతన ఫైర్వాల్స్ ఆడిట్ చేస్తున్నాయి ఐటీ టీమ్స్.