తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సివిల్ జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 66. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్). అన్ రిజర్వ్డ్ 13, ఈడబ్ల్యూఎస్ 11, పీడబ్ల్యూబీఎస్ 02, బీసీ 28(గ్రూప్–ఏ 09, గ్రూప్–బీ 06, గ్రూప్–సీ 02, గ్రూప్–డీ 06, గ్రూప్–ఈ 05), ఎస్సీ 05, ఎస్టీ 05.
ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీని కలిగి ఉండాలి. సివిల్ లేదా క్రిమినల్ న్యాయస్థానాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర న్యాయ (సర్వీస్, కేడర్) నియమాలు– 2023 ప్రకారం న్యాయవాదిగా నమోదు చేసుకోవడానికి అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి(2025, డిసెంబర్ 01 నాటికి): తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ (సర్వీస్, కేడర్) నియమాలు 2023 నిబంధనల ప్రకారం వయోపరిమితి కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 12.
లాస్ట్ డేట్: డిసెంబర్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్): 2026, ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉన్నది.
పూర్తి వివరాలకు tshc.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
