ఎల్లారెడ్డిపేట, వెలుగు: తనను సర్పంచ్ గా గెలిపిస్తే నెల రోజుల నుంచే గ్రామంలో ఆరు అభివృద్ధి పనులను ప్రారంభిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ బలపరిచిన అభ్యర్థి దాసరి గణేశ్ స్టాంప్ పేపర్ రాసి గ్రామస్తులకు హామీ ఇస్తూ బుధవారం నామినేషన్ వేశాడు.
