కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ మార్కండేయ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని రెండు ఫ్లాట్లలో చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. విజేత మనోహర అపార్ట్‌మెంట్‌లో కాశేట్టి సందీప్ కుమార్ కరీంనగర్ సిటీలో బేకరీ నడిపిస్తున్నాడు. ఇటీవల తన తండ్రి శ్రీనివాస్ మరణించడంతో శాంతి పూజ చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి జగిత్యాలకు వెళ్లాడు.
బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. లాకర్ ఓపెన్ చేసి రూ.3.49 లక్షల విలువైన బంగారం, వెండి నగలతోపాటు రూ .55 వేల నగదు చోరీ చేశారు. ఇదే అపార్ట్‌మెంట్‌లో ప్రవీణ్ కుమార్ కూడా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. తాళం పగలగొట్టి రూ.2.62 లక్షల విలువైన బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లారు. టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో క్లూస్ టీంను రప్పించి పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సృజన్ రెడ్డి కేసు నమోదు చేశారు.
తాళం వేసిన ఇంట్లో చోరి
కోరుట్ల, వెలుగు: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన కురుమ మల్లారెడ్డి ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న మల్లారెడ్డి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న సుమారు 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కాగా బుధవారం ఉదయం ఇంట్లోని బంగారం కనబడకపోవడంతో చోరీ గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.
