డ్రంక్ అండ్ డ్రైవ్ పై మరింత కఠినంగా వ్యవహరిస్తాం

డ్రంక్ అండ్ డ్రైవ్ పై మరింత కఠినంగా వ్యవహరిస్తాం

డ్రంక్ అండ్ డ్రైవ్ పై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఉన్న ఆఫీసర్స్ కు భద్రత విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మందు కొట్టి  వెహికిల్ నడపడం తో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విచారణ చేస్తున్న ASi మహిపాల్ రెడ్డి ని అతివేగంగా వచ్చి క్యాబ్ డ్రైవర్ ఢీ కొట్టగా..ఆయన చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు. ఓ హోం గార్డ్ ను  మందు తాగిన ఓ వ్యక్తి ఢీ కొట్టడంతో ఆయన గాయపడ్డాడని తెలిపారు. 

ప్రమాదంలో చనిపోయిన Asi మహిపాల్ రెడ్డి తన అవయవాలు దానం చేశారని తెలిపారు. మహిపాల్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా అవయవ దానం చేయాలని కోరారు సీపీ సజ్జనార్.  అంతేకాదు ఈ ప్రమాదాలకు కారణమైన నిందితులు పై కట్టిన చర్యలు తీసుకుంటామని.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరు రోడ్లు పైకి రావద్దని ప్రజలకు సూచించారు సీపీ.