
హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ మూఠాను అరెస్ట్ చేశామన్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. 50 గ్రాముల MDMA , 45 కేజీల గాంజాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో కేసులో ఐదు గ్రాముల MDMAను సీజ్ చేశామన్నారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 132 డ్రగ్స్ కేసుల్లో 257 మందిని అరెస్ట్ చేశామన్నారు. 8 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. RBL ఫేక్ కాల్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మొత్తం 23 మందిలో 16 మంది అరెస్ట్ చేసామని, ఏడుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.