
గచ్చిబౌలి, వెలుగు: బీఎన్ఎస్ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత సైబరాబాద్కమిషనరేట్పరిధిలో తొలిసారిగా ఆస్తి అటాచ్మెంట్జరిగినట్లు మాదాపూర్జోన్డీసీపీ డా.జి. వినీత్తెలిపారు. ఈ కేసు వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. కొండాపూర్తెలుగు ఫుడ్స్ కార్యాలయంలో పనిచేసే వేణుగోపాల్.. నాలుగేళ్లుగా కంపెనీ డబ్బులను దారి మళ్లిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని మూడు నెలల కింద కంపెనీ ప్రతినిధులు గుర్తించి ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దారి మళ్లించిన డబ్బులతో వేణుగోపాల్ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు విచారణలో గుర్తించారు. అనంతరం బీఎన్ఎస్ఎస్107 కింద కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, మెజిస్ట్రేట్ రాచర్ల షాలిని ఆ భూమిని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వుల వరకు భూమి క్రయవిక్రయాలను నిషేధిస్తూ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చారు.