భద్రాచలంలో అరుదైన శస్త్రచికిత్స.. 8 ఏండ్ల బాలుడి కడుపులో నుంచి స్క్రూ డ్రైవర్ తీసిన డాక్టర్లు

భద్రాచలంలో అరుదైన శస్త్రచికిత్స.. 8 ఏండ్ల బాలుడి కడుపులో నుంచి స్క్రూ డ్రైవర్ తీసిన డాక్టర్లు

పేరెంట్స్ కాస్త ఏమరుపాటుగా ఉంటే పిల్లలు ఏం చేస్తారో అర్థం కాని విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ బాలుడు స్క్రూ డ్రైవర్ మింగిన ఘటన కలకలం రేపింది. ఆడుకుంటూ 8 ఏండ్ల బాలుడు స్క్రూ డ్రైవర్ మింగటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

భద్రాచలం ఏరియా ఆస్పత్రి డాక్టర్లు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మూడు గంటల పాటు శ్రమించి స్క్రూ డ్రైవర్ తొలగించారు. బాలుడి కడుపులో నుంచి 6 సెంటిమీటర్ల స్క్రూ డ్రైవర్ ను బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు ఆసుపత్రి వైద్యులు. దీంతో బాలుడు కటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.