సెప్టెంబర్19నుంచి సరస్‌‌‌‌‌‌‌‌ మేళా..విజయవంతం చేయాలని మంత్రి సీతక్కపిలుపు

సెప్టెంబర్19నుంచి సరస్‌‌‌‌‌‌‌‌ మేళా..విజయవంతం చేయాలని మంత్రి సీతక్కపిలుపు

హైదరాబాద్, వెలుగు: పల్లె కాంతులు విరిసేలా హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్ సిటీలో ఈ నెల 19 నుంచి సరస్ మేళా నిర్వహించనున్నారు. శిల్పారామంలోని ఇందిరా మ‌‌‌‌హిళాశ‌‌‌‌క్తి బ‌‌‌‌జార్‌‌‌‌‌‌‌‌లో గ్రామీణ ఉత్పత్తుల మ‌‌‌‌హా ప్రద‌‌‌‌ర్శన ఏర్పాటు చేయనున్నారు. మేళాను మంత్రి సీత‌‌‌‌క్క శుక్రవారం ప్రారంభించనుండగా..  29 వరకు కొనసాగనున్నది. దేశం నలుమూలల నుంచి తెచ్చి న ప్రత్యేక కళాకృతులు, చేనేత వస్త్రాలు, అరుదైన వంటకాలు అన్నీ ఒకేచోట ఏర్పాటు చేయనున్నారు. 

ఈ  మేళాలో అడవి ప్రాంతాల్లో దొరికే తేనె, ఇప్ప పువ్వు లడ్డూల వంటి అరుదైన ఆహార పదార్థాలతోపాటు మరెన్నో వస్తువులు లభించనున్నాయి. గ్రామీణ ఉత్పత్తులకు సరస్​ మేళా వేదికగా నిలవనున్నదని, అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి సీత‌‌‌‌క్క పిలుపునిచ్చారు.