
న్యూఢిల్లీ: అట్లాంటా ఎలక్ట్రికల్స్ ఐపీఓ ఈనెల 22–24 తేదీల మధ్య ఉంటుంది. కంపెనీ దీని ద్వారా రూ.687 కోట్ల నిధులు సేకరించనుంది. ప్రైస్బ్యాండ్ను రూ.718–రూ.754 మధ్య నిర్ణయించారు. దీని ద్వారా అట్లాంటాకు రూ.5,800 కోట్ల విలువ లభిస్తుంది.
ఈ ఐపీఓలో రూ.400 కోట్ల విలువైన కొత్త షేర్లు జారీ అవుతాయి. ప్రమోటర్, ఇతర వాటాదారులు రూ.287 కోట్ల విలువైన 38.1 లక్షల ఈక్విటీ షేర్లను ఓఎఫ్ఎస్ కింద అమ్ముతారు.
ఐపీఓ ద్వారా వచ్చే నిధులను కంపెనీ అప్పులు తీర్చడానికి, కార్యకలాపాలకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడతారు.