
హైదరాబాద్, వెలుగు: టాటా లగ్జరీ ఫ్యాషన్బ్రాండ్తనైరా పండుగ ఆఫర్లను ప్రకటించడంతోపాటు 'మియారా' అనే కొత్త కలెక్షన్ను ప్రారంభించింది. రూ.10వేల విలువైన ప్రతి కొనుగోలుపై కస్టమర్లకు రూ.వెయ్యి విలువైన వోచర్ లభిస్తుంది. దీనిని తదుపరి కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు.
రూ.50వేలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి 0.2 గ్రాముల తనిష్క్ బంగారు నాణెం ఉచితంగా లభిస్తుంది. గోల్డెన్ కోకన్ పథకం ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన చీరను వాయిదాల పద్ధతిలో సొంతం చేసుకోవచ్చు. ఈ పరిమిత కాల ఆఫర్‌లు వచ్చేనెల 20వ తేదీ అందుబాటులో ఉంటాయి. మియారా చీరల ధరలు రూ.6,499 నుంచి ప్రారంభం అవుతాయి.
ఇదిలా ఉంటే తమ కంపెనీ 2–3 ఏళ్లలో లాభాల్లోకి వస్తుందని తనైరా సీఈఓ అంబుజ్ నారాయణ్ ఢిల్లీలో ప్రకటించారు. పండుగ సమయంలో 30 శాతం వరకు గ్రోత్ సాధిస్తామని చెప్పారు. ఏటా కొత్తగా 20 స్టోర్ల వరకు ఏర్పాటు చేస్తామన్నారు.