
తిరుపతి జిల్లాలోని రేణిగుంట పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మునోత్ గ్రూపు లిథియం సెల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీ, మెషినరీ, ముడి సరుకులు అగ్నికి ఆహుతి అయ్యాయి. యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం 70 నుంచి 80 కోట్ల వరకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.