జనానికి రూ.2 లక్షల కోట్లు ఆదా.. జీఎస్టీ తగ్గింపుతో ఎంతో మేలు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

జనానికి రూ.2 లక్షల కోట్లు ఆదా.. జీఎస్టీ తగ్గింపుతో ఎంతో మేలు:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

న్యూఢిల్లీ:  జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు రూ. 2 లక్షల కోట్లు ఆదా అవుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఆదాయపు పన్నులో ఇచ్చిన రాయితీలతో పాటు ఈ జీఎస్​టీ మార్పులు ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాయని అన్నారు. 

సెప్టెంబర్ 22 నుంచి జీఎస్​టీలో మార్పులు రానున్నాయని, కొత్త విధానంలో, 12 శాతం 28 శాతం స్లాబ్‌‌‌‌లను తొలగించి, రెండు కొత్త స్లాబ్‌‌‌‌లు (5శాతం, 18శాతం) ప్రవేశపెట్టామని చెప్పారు.  99 శాతం వస్తువులు 5 శాతం జీఎస్టీ స్లాబ్‌‌‌‌లోకి వచ్చాయని, దీని వల్ల మధ్యతరగతి పేదలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. 

జీఎస్​టీ మండలి తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు తోడ్పడుతుందన్నారు.  పన్ను చెల్లింపుదారుల సంఖ్య 65 లక్షల నుంచి 1.51 కోట్లకు పెరిగిందని మంత్రి నిర్మల తెలిపారు.