మన చిన్నారుల భద్రత మన చేతుల్లోనే..కార్లలో పిల్లలు చిక్కుకోకుండా ఇలా కాపాడుకోవచ్చు

మన చిన్నారుల భద్రత మన చేతుల్లోనే..కార్లలో పిల్లలు చిక్కుకోకుండా ఇలా కాపాడుకోవచ్చు

గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల కాలంలో పిల్లలు ఆడుకునేందుకు పార్కింగ్​చేసిన కార్లలోకి వెళ్లి ఊపిరాడక మృతి చెందిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాల నివారణకు సైబరాబాద్​పోలీసుల పలు జాగ్రత్తలు సూచించారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కార్లలో చిక్కుకున్న చిన్నారులను ప్రాణాలతో రక్షించగలమని పేర్కొన్నారు. 

ఇవీ జాగ్రత్తలు..

  • కారును లాక్ చేయడానికి ముందు వెనుక సీట్లను ఒకటికి రెండు సార్లు చెక్​చేయాలి. పిల్లలు లేదా పెంపుడు జంతువులు లోపల ఉండకుండా చూడాలి. 
  • వాహనం చుట్టు పక్కల, వాహనం లోపల పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లకూడదు.
  • కారు కీలు లేదా రిమోట్ లాకింగ్ డివైస్‌లను పిల్లల చేతులకు అందకుండా దూరంగా ఉంచాలి.
  • రియల్ సీట్ రిమైండర్స్, చైల్డ్ డిటెక్షన్ సిస్టమ్స్ వంటి సేఫ్టీ అలర్ట్‌ లను అమర్చుకొని, ఇన్‌స్టాల్ చేయాలి. ఇవి కారులో పిల్లలు ఉండిపోతే హెచ్చరిస్తాయి.
  • కారు విండోలకు బ్లాక్​ ఫిల్మ్​లు, హెవీ టింటెడ్ విండోస్ ఉపయోగించకూడదు. ఇలా చేస్తే వాహనాల్లో ఎవరు ఉన్నారో గుర్తించలేం.
  • పిల్లలు కనిపించని సమయంలో సమీప వాహనాల్లో చెక్​ చేయాలి.
  • ఇవి ప్రతి ఒక్కరూ పాటించడమే కాకుండా తమ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు.