భారీగా ఎక్స్ పైరీ ఫుడ్ .. 22 రకాల ఐటమ్స్ స్వాధీనం

భారీగా ఎక్స్ పైరీ ఫుడ్ .. 22 రకాల ఐటమ్స్ స్వాధీనం

రంగారెడ్డి జిల్లా శాతంరాయి గ్రామంలో ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడువు ముగిసినా వాటిని అమ్ముతున్నట్లు గుర్తించారు. తక్కువ ధరకే కిరాణా షాపులో అమ్ముతున్న సైబుద్దీన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. షాపులో నుంచి భారీ మొత్తంలో ఎక్స్పైరీ ఫుడ్ ఐటమ్స్ ను  పోలీసులు పట్టుకున్నారు. ఈ పదార్థాలను అక్రమ మార్గంలో కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 22 రకాల ఫుడ్ ఐటమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.41 వేలు ఉంటుందన్నారు. నిందితు డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

1)పానీ పూరీ పాపడ్ ప్యాకెట్లు-104 (ప్రతి ప్యాకెట్‌లో 10 ఉంటాయి)
2) పలు  రకాల మసాలా ప్యాకెట్లు - 72 సీసాలు
3) అజ్వా ప్యాకెట్లు- 67
4) బార్లీ దలియా - 140 ప్యాకెట్లు
5) నట్ మెగ్ -30 ప్యాకెట్లు
6) హలీమ్ విత్తనాలు - 22 ప్యాకెట్లు
7) డానియా పౌడర్ - 195 ప్యాకెట్లు
8) సిద్ధగిరి సాత్విక్ - 20 ప్యాకెట్లు
9) సోయా ఫ్లేవర్ - 42
10) పాస్ పాస్ - 60 ప్యాకెట్లు
11) సేమియా ప్యాకెట్లు - 30 ప్యాకెట్లు
12) వేదకా బజ్రా ఫ్లేవర్ -14 ప్యాకెట్లు
13) AHAAR రైస్ ఫ్లేవర్ - 30 ప్యాకెట్లు
14) తేదీలు - 20 పెట్టెలు
15) AHAAR సౌజీ ప్యాకెట్- 70
16) కాన్ + ఓట్స్ ఫ్లేవర్ - 21
17) దలియా వీట్ - 100
18) చింతపండు - 17 కిలోలు
19) బెల్లం పొడి - 62 ప్యాకెట్లు
20) సుగంధ ద్రవ్యాల మిశ్రమం - 70
21) నట్ మిక్స్ - 26
22) చాక్లెట్ మిక్స్ - 250

ALSO READ :- Ilaiyaraaja Biopic Official : ఇళయరాజా బయోపిక్లో ధనుష్..డైరెక్టర్ ఎవరంటే?